Header Banner

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ నెలకు రూ.4 వేలు! అప్పటి నుంచే అమలు!

  Thu May 15, 2025 07:32        Politics

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై వచ్చే నెల 12వ తేదీతో ఏడాది పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో కూటమి సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలోకి మరింత మందిని చేర్చాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం నిలిపివేసిన వారికి మళ్లీ పింఛన్లు అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

జూన్ 12వ తేదీతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రాష్ట్రంలోని లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఒంటరి మహిళలు, వితంతువులకు గతంలోని వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిన పింఛన్లను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4 వేల చొప్పున పింఛన్‌ అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత పొలిట్ బ్యూరో నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు.

ఇందులో భాగంగా ప్రతి నెలా రాష్ట్రంలోని అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా ఏడాది క్యాలెండర్‌ రూపకల్పనకు పొలిట్‌ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అంతేకాకుండా ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన వారికి సంఘీభావంగా ఈ నెల 16, 17, 18వ తేదీల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీపం పథకంలో భాగంగా సిలిండర్ బుకింగ్ కంటే ముందే లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో తీసుకునే 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయించారు. అదే సమయంలో జూన్ 12వ తేదీ నుంచే రాష్ట్రంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను కూడా ప్రారంభించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APWelfare #FinancialSupport #4000PerMonth #APGovtSchemes #PublicWelfare #GoodNewsAP